calender_icon.png 27 December, 2024 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ

04-12-2024 12:58:34 AM

పటాన్‌చెరు, డిసెంబర్ 3: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళారం పటాన్‌చెరు లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లకు సంబంధించిన 225 మంది దివ్యాంగులకు రూ.17.97 లక్షలతో కొనుగోలు చేసిన  వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, చేతికర్రలు, ట్రై సైకిళ్లను కార్పొరేటర్లను మెట్టు కుమార్‌యాదవ్, పుష్పనగేశ్, సింధుఆదర్శ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, సీఐ వినాయక్‌రెడ్డి, నాయకులు అఫ్జల్ పాల్గొన్నారు.