calender_icon.png 23 February, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సమస్యలపై ప్రత్యేక ప్రజావాణి

22-02-2025 09:58:18 PM

20 మంది రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాన్స్ఫార్మర్ లు పంపిణీ 

మూడు నెలల కోపారి రైతు సమస్యల పరిష్కారానికై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి) : రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని విద్యుత్ భవన్ వద్ద వ్యవసాయ అవసరాల కోసం 20 మంది రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాన్స్ఫార్మర్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సాగు చేసిన పంటలకు విద్యుత్ ఇబ్బంది ఉండకూడదని విద్యుత్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేవలం రైతు సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. హన్వాడ మండలంలోని గొండ్యాల లో 132 కెవి సబ్ స్టేషన్ మంజూరు చేయించుకోవడం జరిగిందని, ఆరు 33/11 కెవి  సబ్ స్టేషన్లు మంజూరు చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  ఎస్ ఈ  పివి రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,  డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,  మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేంకటాద్రి, ఓబిసి సెల్ రాజు గౌడ్, మహబూబ్ నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, శ్రీనివాస్ యాదవ్, బుద్దారం సుధాకర్ రెడ్డి

ఆ పాలకులకు ఉపాధి దొరికింది.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

గత ప్రభుత్వము కేవలం వారి కోసమే ఉపాధి దొరికినట్టు భావించి వారి లబ్ధి కోసమే పని చేశారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. క్రిష్టియన్ పల్లి లోని  ప్రభుత్వ ఎంవిఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల   ప్రాంగణంలో రూ 10 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బాలికల హాస్టల్ భవనానికి ఎమ్మెల్యే  భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, విద్యా వ్యవస్థ కు ప్రజా పాలన ప్రభుత్వంలో మంచి రోజులు ఉంటున్నాయని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యావ్యవస్థలు మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి, తదితరులు ఉన్నారు.

ప్రతి ఒకరిలో దైవభక్తి ఉండాలి.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కృపా కటాక్షం అందరిపైన ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  స్పష్టం చేశారు.   మన్యం కొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో 10 లక్షల రూపాయల తో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ ను ప్రారంభించారు.  అంతకుముందు స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అతి పురాతనమైన ఈ ఆలయాన్ని   అన్ని రకాలుగా  అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.   యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మాదిరిగానే ఇక్కడ స్వామి వారు వెలిసారని ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి తెలిపారు.  అనంతరం ఎమ్మెల్యే గారికి స్వామి వారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించి, వేద ఆశీర్వాదం అందజేశారు.  ఎమ్మెల్యే గారితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రామచంద్రయ్య, మన్యంకొండ నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ , ఎంపిడిఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,  అభిమానులు తదితరులు పాల్గొన్నారు.