01-04-2025 05:03:59 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ మండలంలో మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఈసా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురేంద్ర శంకర్, రాష్ట్ర ఎఫ్సీఐ మెంబర్ పులగం తిరుపతి, యూత్ జనరల్ సెక్రటరీ జుబేర్, మాజీ జెడ్పిటిసి బానయ్య, మాజీ గ్రంథాలయ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు, కంపెల చిన్నయ్య, చాంద్ పాషా, విలాస్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ శంకర్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ సత్యం, ముసుగసాగర్, మంథని శివకృష్ణ, మల్లేష్, రఘు, దుర్గ మహేందర్, శేఖర్, విలాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.