20-03-2025 12:43:24 AM
కాటారం, మార్చి 19 (విజయక్రాంతి) : పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గారేపల్లి గ్రామానికి చెందిన తోట సమ్మయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు తోట రాజు వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానోపాధ్యాయురాలు ఉమా రాణి, ఉపాధ్యా యులు బొల్లం సతీష్ పాల్గొన్నారు.