calender_icon.png 29 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాసిరకం చేపపిల్లల పంపిణీ?

14-11-2024 12:28:02 AM

చేప పిల్లలను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

నాగర్‌కర్నూల్, నవంబర్ 13 (విజయక్రాంతి): కొల్లాపూర్ మండలం సోమశిల ప్రాంతంలోని కృష్ణానదిలో బుధవారం ప్రభుత్వం తరఫున విడుదల చేసేందుకు తెచ్చిన చేపపిల్లలు నాసిరకంగా ఉండటంతో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా మత్య్సశాఖాధికారిణి రజినిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేప పిల్లలు చిన్నవిగా ఉండటంతో స్కేల్ సాయంతో కొలిచి మరీ ఇంత చిన్నవి ఎలా పంపిణీ చేస్తున్నారంటూ సంబంధిత కాంట్రాక్టర్, జిల్లా అధికారిణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ పంపిణీ చేసినా ముందస్తు సమాచారం ఇవ్వాలని, పంపిణీలో నాణ్యత పాటించాలని మంత్రి ఆదేశించారు.

కాగా సోమశిలకు భక్తుల తాకిడి పెరుగుతుండటంతో వసతులను పెంచుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ బదావత్ సంతోష్ ఉన్నారు.