నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోమవారపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలకు గురువారం దాతల సహకారంతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను పరీక్ష సామాగ్రిని అందించారు. దాతలు విజయ మేడారం ప్రదీప్ అపర్ణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.