22-03-2025 04:46:16 PM
మునిపల్లి: మండల పరిధిలోని బుదేరా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుదేరా గ్రామానికి చెందిన మంగళి జనార్దన్ అనే క్రీడా సామాగ్రిని అందజేశారు. శనివారం మునిపల్లి మండలంలోని బుదేరా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందించాలని కోరారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడాల్లో రాణిస్తేనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.