calender_icon.png 18 March, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ

18-03-2025 06:25:01 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణం, మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు, క్రీడాకారులకు కేఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ రామకృష్ణాపూర్ (వి) లో కేఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు కలకుంట్ల సందీప్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేకును కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామీణ యువకులకు క్రీడా సామాగ్రిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ... కేఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సామాజిక సేవ కార్యక్రమాలు చేయడానికి సంస్థ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎనగందుల సత్యనారాయణ, జంజిరాల వెంకటేష్, రాము, బచ్చలి ప్రవీణ్, కుర్రే శ్రీనివాస్, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.