21-04-2025 12:44:16 AM
ఘనంగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలు
చేగుంట, ఏప్రిల్ 20 : దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు చేగుంట లో ఘనంగా నిర్వహించారు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తూప్రాన్ టోల్ ప్లాజా నుండి వందల సంఖ్యలో కార్లలో చేగుంట బస్టాండ్ దగ్గరికి వచ్చి అనంతరం అక్కడనుండి ర్యాలీగా గాంధీ చౌరస్తా వరకు వెళ్లారు, గాంధీ చౌరస్తా లో కేక్ కట్ చేసి సండ్రగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా పులిహోరా, నీటి బాటిళ్ళను పంపిణీ చేశారు.
ఈ కార్య క్రమంలో ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ మొజామిల్, ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు, ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, బాలిరెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, దుబ్బాక యూత్ అధ్యక్షులు సయ్యద్ ఉస్సమొద్దీన్, సాయికుమార్ గౌడ్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.