మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని జిఎం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సర్వీస్ లింక్డ్ ప్రమోషన్ పత్రాలను సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ అందచేశారు. గురువారం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగులకు ఎస్ఎల్పీ పత్రాలను అందచేసి మాట్లాడారు. నూతన సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో విధులు నిర్వహించి అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేసి సంస్థ ప్రగతికి దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జి.ఎం సేఫ్టీ రఘు కుమార్, ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారయణ, సిఎంఓఏఐ అధ్యక్షులు రవి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, డీజీఎం, ఎం వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డీజీఎం ఐఈడి రాజన్న, ఫారెస్ట్ అధికారి రమణారెడ్డి, ఏరియా సర్వేఆఫీసర్ బందోపాధ్యాయ, ఎస్ కె గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖాదిర్, క్వాలిటీ ఇంచార్జ్ ప్రదీప్, పర్చేస్ అదికారి బాబు, సెక్యూరిటీ ఆఫీసర్ రవి, డివైపిఎం ఆసిఫ్, జిఎం కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.