31-03-2025 04:07:29 PM
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఇందిరా కాలనీ ఈద్గా వద్ద మాజీ మంత్రి వెంకటేశ్వరరావు(Former Minister Venkateswara Rao) సోమవారం రంజాన్ పండగ పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి సేమియా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్వీ అధ్యక్షులు బత్తుల మధుచంద్, కాల్వ ప్రకాష్, పాల్వంచ బీఆర్ఎస్ రూరల్ అధ్యక్షులు మల్లెల శ్రీరామ్ మూర్తి, కొత్వాల సత్యనారాయణ, బేతంశెట్టి విజయ్, తెలంగాణ సురేష్, కుంపటి శివ, శీలం సమ్మయ్య గౌడ్, నారకట్ల రాజశేఖర్, భూక్య వీరన్న, కటారి చంద్రశేఖర్, బొల్లోరిగూడెం హర్షవర్ధన్, చందు నాయక్, నవభారత్ ఆనంద్, తెలంగాణ గిరి తదితరులు పాల్గొన్నారు.