calender_icon.png 3 February, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తన గణేశ్ ప్రతిమల పంపిణీ

04-09-2024 12:30:56 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయి ల్స్, రిఫైనరీ జెమి నీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా (జేఈఎఫ్ ఇండియా) ఆధ్వర్యంలోఆయా కంపెనీల ప్రతినిధులు పర్యావరణ పరిరక్షణ కోసం 10 వేల విత్తన గణేశ్ ప్రతిమలు పంపిణీ చేయనున్నారు. మంగళ వారం ఈ మేరకు సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డి, డీజీఎం చేతన్ పింపాల్‌ఖుటే పంపిణీ వాహనాలను ప్రారంభిం చారు. ఐదు సంవత్సరా లుగా విత్తన గణేశ్  ప్రతిమలు పంపిణీ చేస్తున్నామని, ఈసారి కూడా 10 వేల ప్రతిమల ను పంపిణీ చేస్తున్నట్లు  తెలిపారు.