calender_icon.png 1 April, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరల పంపిణీ

30-03-2025 03:40:35 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆదేశానుసారం ఖానాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని గంగాయిపేట గ్రామంలో నిరుపేద ఇటుక బట్టి మహిళా కార్మికులకు చీరలు, పండ్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ మహాజన్ జీతేందర్ మాట్లాడుతూ... నిరుపేదలను ఆదుకునేందుకు వాసవి క్లబ్ ఎల్లవేళలా ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు చిటికేసి రవీందర్, ప్రధాన కార్యదర్శి చిటికేసి సతీష్ కుమార్, కోశాధికారి కూరగాయల సతీష్, జిల్లా మాజీ కోశాధికారి పాలెపు సుదర్శన్, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు మహాజన్ జలంధర్ గుప్తా కార్యదర్శి సామ లక్ష్మీనారాయణ, కటకం వేణుగోపాల్, కటకం అశోక్ కుమార్, రుద్రవర్ సాయి చరణ్, క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.