calender_icon.png 27 January, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణీ

26-01-2025 06:04:27 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ వద్ద వాసవీ క్లబ్, వాసవీ వనితా వైభవంల ఆద్వర్యంలో మున్సిపాలిటీ కార్మికులకు చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఆదివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా క్లబ్ అధ్యక్షుడు మిట్టపల్లి శ్యామ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాలను ఆలపించారు. రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులను బాధ్యతలను ఈ సందర్భంగా భక్తులు గుర్తు చేశారు. అనంతరం సుమారు వందమంది నిరుపేదలకు, మున్సిపాలిటీ సిబ్బందికి చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు వర్తక సంఘం అధ్యక్షులు దోసపాటి నాగేశ్వరరావు, వాసవీ వనితా వైభవం అధ్యక్షురాలు బొగ్గవరపు అంజలి, కంకటాల సాయి, జోన్ ఛైర్మన్ దోసపాటీ స్వర్ణ, ఐపీసీ బండారు నరసింహారావు, వనమా రామకృష్ణ, క్లబ్ జిల్లా పీ ఆర్ ఓ కడివెండి విశ్వనాధ గుప్తా, జిల్లా జాయింట్ సెక్రటరీ చిట్టూరి శేషు బాబు, జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు చిత్తలూరి ఉమ, చిత్తలూరి రమేష్, దింటకుర్తి బ్రహ్మయ్య, కేసా రాజేంద్రప్రసాద్, సుగ్గల భాను, వెచ్చా చంద్ర శేఖర్, సంకా శ్రీనివాసరావు, రాధా శ్యామ్ గుప్తా, దోసపాటీ ధర్మారావు, మురహరీ, మోహన్ రావు, స్వప్న, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.