calender_icon.png 20 April, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల దాహార్తి తీర్చేందుకే అంబలి పంపిణీ

12-04-2025 07:10:13 PM

లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఉబైద్ బిన్ యహియా..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రతి సంవత్సరం వేసవిలో అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఉబైద్ బిన్ యహియా శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో బాటసారులకు, ప్రయాణికులకు, ప్రజలకు అంబలి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు ఆకలి, దాహం, తీర్చడంతో నాకు ఎంతో తృప్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రమణ రెడ్డి, వినాయక్ రావు, పుల్లూరి శంకర్, భీమ్ రావు, విశాల్ ఖాండ్రే, ముబాషీర్, గులాం జావిద్, మాస్, ఫుర్ఖాన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.