calender_icon.png 10 January, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరాశ్రయులకు రగ్గుల పంపిణీ

01-01-2025 01:08:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నూతన సంవత్సరం సందర్భంగా నగర వీధుల్లో చలికి వణుకుతున్న నిరాశ్రయులను ఆదుకునేందుకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నర్సులు ఔదార్యం చూపారు. ఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలో సుమారు 50మంది నిరుపేదలకు మంగళవారం రగ్గులు పంపిణీ చేశారు.

నర్స్ ఎడ్యుకేటర్ రాహుల్ కుమర్ మాట్లాడుతూ.. అభాగ్యులను చూసి చలించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సుమారు 120మంది నర్సులు తమ సంపాదన నుంచి కొంత వెచ్చించి  రగ్గులను కొనుగోలు చేసి ఎస్‌ఆర్‌నగర్‌లో పేదలకు పంపిణీ చేశారు.