calender_icon.png 4 April, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం నిధులతోనే సన్నబియ్యం పంపిణీ

04-04-2025 12:38:48 AM

బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి

తిమ్మాపూర్ ఏప్రిల్ ౩ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని కరీం నగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి పేర్కొ న్నారు. దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్న క్రమంలో గురువారం బీజేపీ కార్యకర్తలు రామక్రిష్ణకాలనీ లోని రేషన్ షాప్ వద్ద ప్రచారం చేసారు. ఈ సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ 5 ఏళ్ల  పాటుగా ఉచితంగా బియ్యం ఇస్తున్న విషయం చేయకుండా, అవే నిధులతో సన్న బియ్యం కొనుగోలు చేసి ఇస్తున్నారని అన్నారు.

కేంద్రం ఇస్తున్న బియ్యం విషయంలో రేషన్ షాప్ ల వద్ద ఉన్నటువంటి మిషన్ ద్వారా రసీదులను ప్రజలకు చూపించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మంచిదే అయినప్పటికీ గొప్పలకోసం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎడ్ల భూంరెడ్డి, దుర్గుంటి శేఖర్, చింతలపల్లి రవీందర్ రెడ్డి, సిరికొండ వెంకట్రావు, మార్క కనకయ్య,రంగు భాస్కర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు