calender_icon.png 8 April, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం..

06-04-2025 06:52:29 PM

టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్..

మునుగోడు/నాంపల్లి (విజయక్రాంతి): పేదలకు సన్న బియ్యం పంపిణీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రెవల్లి  గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు సైతం సన్నబియంతో భోజనం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు.

దేశ చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రంలో సన్నబియం పంపిణీ చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి చంద్ర రెడ్డి, కోన్రెడ్డి వెంకటయ్య మేకల రాములు, కొండల్, ఏటెల్లి వెంకటయ్య, వంగూరి చంద్రయ్యా, కొత్తగోల్ల వెంకన్న, శివ, సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.