05-04-2025 07:01:08 PM
మునిపల్లి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు శనివారం నాడు మండల పరిధిలోని గార్లపల్లి గ్రామంలో నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దోండి రావు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరి కడుపు నింపాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అలాగే మంత్రి దామోదర రాజనర్సింహ్మ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇమామ్, కిషన్ రావు, సంగయ్య, విఠల్, రేషన్ డీలర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.