calender_icon.png 22 December, 2024 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ

21-12-2024 10:29:41 PM

మందమర్రి (విజయక్రాంతి): జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా సబ్సిడీపై వరి విత్తనాలు అందించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ చెన్నూర్ ఏడిఏ బానోత్ ప్రసాద్ తెలిపారు. మండలంలోని అందుగులపేట, మందమర్రి, వెంకటాపూర్, తిమ్మాపూర్ రెవిన్యూ గ్రామాలకు చెందిన 28 మంది రైతులకు జాతీయ ఆహార భద్రత మిషన్ 2024-25 సంవత్సరానికి యాసంగి పంట కాలానికి అనువైన జెజీఎల్ 24423(జగిత్యాల రైస్ 1) వరి రకం విత్తనాలను యాభై శాతం సబ్సిడీపై అందుగులపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జెజీఎల్ 24423(జగిత్యాల రైస్ 1) రకం దృవీకృత వరి విత్తనం 125 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి సుడిదోమ, ఉల్లికోడు వంటి రోగాలను తట్టుకుని పడి పోయే గుణం లేకుండా ఉంటుందన్నారు. ఎకరానికి సుమారు 30 క్వింటాలు దిగుబడినిస్తుందని తెలిపారు. ఆనంతరం వరి కొయ్యకాళ్లు కాల్చడం వలన కలిగే దుష్పరిణామాలపై రైతులకు  అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, రైతులు ఏనుగు హనుమంత రెడ్డి, దుర్గం శ్రీను, ఆశిరెడ్డి, రాజేష్, శంకర్, తిరుపతి, జక్కుల ఆగయ్య, దక్షిణామూర్తి, అరుకటి రవిలు పాల్గొన్నారు.