calender_icon.png 20 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం

04-04-2025 01:08:04 AM

ఎమ్మెల్యే విజయరమణరావు

పెద్దపల్లి మార్చి3 (విజయ క్రాంతి) తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ దేశానికి ఆదర్శమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి మండలం చీకురాయిలో రేషన్ దుకాణంలో గురువారం లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజల ఆకలి గోస తీర్చేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. పేదలకు సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని,  వానాకాలం వరి పంట కొను గోలు సమయంలో రైతులకు  క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పెద్దపల్లి నియోజకవర్గంలో చౌక ధరల దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, మాజీ జడ్పీటిసి బండారి రాంమూర్తి, మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మాదిరెడ్డి నర్సింహ రెడ్డి, మండల సుధాకర్ రెడ్డి, ఓదెల శ్రీనివాస్, నర్రా కుమార్, సదయ్య, జక్కుల సందీప్, మల్లయ్య, శ్రీనివాస్, శెంకర్, తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం  ప్రజా ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్నబియ్యం అందించే కార్యక్రమం ప్రజా ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందని, పేద ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నారు. గురువారం బోయినిపల్లి మండల కేంద్రంలోని చౌకధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. 

గత ప్రభుత్వం ఏనాడూ ఈ సన్నబియ్యం పేదలకు పంపిణీ చేయాలి అనే విషయం ఆలోచించలేదని.ఈ సన్నబియ్యం సామాన్య ప్రజలకు కూడా అందించాలి, సామాన్యులు ఆరోగ్యంగా, ఆత్మగౌరవంతో, ఆత్మస్థైర్యంతో బ్రతకాలని ఆలోచించి, సన్నబియ్యం పం పిణీ కార్యక్రమాన్ని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో ప్రజా ప్రభుత్వ హయాం లో ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కొలువుదీరిందని, దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకం ఎక్కడా లేదని అన్నారు. గత పది సంవత్సరాలు పాలించిన పాలకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి, ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టివేసారని వ్యాఖ్యానించారు.  అనంతరం లబ్దిదారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతులమీదుగా సన్నబియ్యం పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించే మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి వసం తలక్ష్మి, తహశీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల,ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ ,సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.