calender_icon.png 2 April, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా సన్న బియ్యం పంపిణీ

01-04-2025 06:36:30 PM

మఠంపల్లి: అట్టహాసంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం.. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి పేద ప్రజలకు సన్న బియ్యం ఇచ్చే బృహత్తరమైన కార్యక్రమమును ఉగాది పండుగ రోజున రాష్ట్ర పౌరసరఫరాల భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో ప్రారంభించారు. అందులో భాగంగా మంగళవారం మఠంపల్లి మండల వ్యాప్తంగా రేషన్ షాపుల్లో పంపిణీ చేశారు.

దీంతో ఉదయం 08 గంటల నుంచే రేషన్ షాపుల వద్ద లబ్దిదారులు బారులుతీరారు. ఈ కార్యక్రమానికి మండల ఎంఆర్ఓ మంగమ్మ, రెవెన్యూ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాబు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ నాయక్, భాస్కర్ నాయక్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.