02-04-2025 12:35:26 AM
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళవారం అన్ని జిల్లాల్లోని రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. ఉగాది పండగను పురస్కరించుకుని మార్చి 30న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపి ణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమా రి.. జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లా డుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని వెల్లడించారు.
ఇప్పటికే యా భై శాతానికిపైగా సన్నబియ్యం రేషన్ షా పులకు వచ్చాయని, మిగిలిన స్టాక్‌ను రెండు రోజుల్లో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. బియ్యం నాణ్యత, పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.