calender_icon.png 31 March, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలకు రేషన్ కిట్‌ల పంపిణీ

28-03-2025 02:04:43 AM

కరీంనగర్, మార్చి27 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లీం కుటుంబాలకు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి రేషన్ కిట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గోదాంగడ్డలో గల మసీద్ వద్ద చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమంలో సుమారుగా 200మంది ముస్లీం సోదరులకు జయపాలన్న మిత్రమండలి సభ్యులు రేషన్ కిట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మైత్రి ఛానల్ ఎం.డి. సుజన్రావు మాట్లాడుతూ..కుల మతాలకు అతీతంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ఎల్లప్పుడు ముందు ఉంటారని, అందులో భాగంగానే రూ. 20లక్షలతో 2వేలకు పైగా పేద ముస్లీం కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంద న్నారు.

ముస్లీం ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొత్త జయపాల్ రెడ్డి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారని, ప్రతీ ఏడు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ముస్లీంలకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు, పేద విద్యార్థుల చదువుకు ఆయనేంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జయపాలన్న మిత్రమండలి సభ్యులు ఎం.డి. అఖిల్‌అహ్మద్ఖాన్, ఖాలీద్ అక్భర్, అమ్జద్లాలా, ఖాలీద్సాబ్, మతిన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.