29-03-2025 10:55:17 PM
వైరా (విజయక్రాంతి): రంజాన్ పండుగను పురస్కరించుకొని వైరా అల్ ఫలాహ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలైన మైనారిటీ ముస్లింలకు 1500 రూపాయలు విలువ చేసే 46 కిట్టు బియ్యం 15 కేజీలు నిత్యవసర సరుకులతో పాటు 500 రూపాయలు నగదు పంపిణీ చేశారు. అల్ ఫలాహ్ యూత్ కమిటీ అధ్యక్షులు షేక్ రిజ్వాన్ మాట్లాడుతూ... నిరుపేద ముస్లిం కుటుంబాలు ఆనందంతో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. మొహమ్మద్ ఫిరోజ్ ఖురేషి మహమ్మద్ రహీం ఖురైషి, మస్జిద మౌలానా, షేక్ సలీం, మున్న, షేక్ రహమతుల్లా, మహమ్మద్ యాసిన్ మహమ్మద్ ముస్తఫా మొహమ్మద్ సాదిక్ పఠాన్ సలీం షేక్ లైకుద్దీన్, తదితరుల సహకారంతో అందజేశామని పంపిణీ చేసినట్లు కమిటీ అధ్యక్షులు తెలిపారు.