22-03-2025 10:20:16 PM
తుంగతుర్తి: హిందూ ముస్లింల మతసామరస్యతకు ప్రతీకగా ఇఫ్తార్ విందులు దోహదపడతాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొందరి గోవర్ధన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్రావులు అన్నారు. శనివారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో గ్రామానికి చెందిన కుంచాల శ్రీనివాస్ రెడ్డి ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, ఎంతో నిష్టతో నెలంతా దీక్షలు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా దుబాయ్ పారిశ్రామికవేత్త అబ్దుల్ బారి వారి తల్లిదండ్రులైన అబ్దుల్ నబీ రజియా బేగం జ్ఞాపకార్థం ముస్లింలకు రంజాన్ ప్యాకేజీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సిద్ధిక్ భాష, గ్రామ మాజీ సర్పంచ్ మిట్ట గడుపుల అనూక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, అజం, జానీ, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.