12-03-2025 01:26:55 AM
జహీరాబాద్, మార్చి 11: పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు సంతోషంగా పండగ చేసుకునేందుకు రంజాన్ సగ్గులు పంపిణీ చేశారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని గడి మహాల్ లో హాల్ ఇన్ఫ్రా గ్లోబల్ డెవలప్మెంట్ యజమాన్యం సయ్యద్ వాజిద్ హక్ పేదలకు రంజాన్ సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ పండుగకు సరిపడే బియ్యం, చక్కెర , పప్పు ఇతర వస్తువులు పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ప్రతి పేదవారు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. పట్టణంలోని రెండువేల మంది పేదలకు రంజాన్ సరుకులు అందజేస్తున్నామని తెలిపారు.