calender_icon.png 3 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు రంజాన్ తోఫా పంపిణీ

30-03-2025 12:19:52 AM

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): కిలా వరంగల్ ఈద్గాలో తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్ గారి ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉర్సు దర్గా పీఠాధిపతి సయ్యద్ ఉబేద్ బాబా, నగర ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం పాల్గొన్నారు.

తవక్కల్ ట్రస్టు చైర్మన్ ఎంఏ జబ్బర్‌ను గారిని అభినందించి, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 41 డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మస్వామిగౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి చాంద్ పాషా, కమిటీ సభ్యులు ఎండి మగ్దూం మీర్జా హసన్ బేగ్ దస్తగీర్ గఫార్, ఇంతియాజ్ ఖాన్, సాదిక్, సలీం, సర్వర్, వహీద్, ఆజం, సర్వర్ అఫ్జల్, ఫహీమ్ అహ్మ ద్, ఎండి యాజం, ఎండి కాజా పాల్గొన్నారు.