29-03-2025 07:54:01 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): స్వీడన్ దేశంలో స్థిరపడ్డ బెల్లంపల్లి పట్టణానికి చెందిన వాణినీకేతన్ పూర్వ విద్యార్థి రేగుల అనిల్ కుమార్ అందించిన ఆర్థిక సహాయంతో శనివారం ఫిజికల్ డైరెక్టర్ ఎస్.కె రాజ్ మహమ్మద్ లక్ష్మీపూర్, బజార్ ఏరియా, కాంట్రాక్టర్ బస్తి, సుభాష్ నగర్ ప్రాంతాల్లో నివసిస్తున్న 30 నిరుపేద ముస్లిం కుటుంబాలను గుర్తించి వారికి రంజాన్ తోఫా కింద నిత్యవసర సరుకులను అందజేశారు. ప్రతి ఏటా నిరుపేద కుటుంబాలకు రంజాన్ మాసంలో నిత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరుపేదలైన ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించేందుకు ఆర్థిక సహాయం అందజేసిన రేగుల అనిల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చక్రపాణి, టైక్వాండో మాస్టర్ జిల్లపల్లి వెంకటస్వామిలు పాల్గొన్నారు.