28-03-2025 06:08:13 PM
మందమర్రి,(విజయక్రాంతి): ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పట్టణ సీఐ శశిధర్ రెడ్డి చేతుల మీదుగా అందచేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు.ఈ సందర్బంగా పట్టణ సీఐ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఆదరించే అల్లాకు ఈనెలలో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటూ భక్తిని చాటుకుంటా రన్నారు. ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా వచ్చే ఉగాది పండుగ, రంజాన్ పండుగ కలసి శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.
అనంతరం ప్రజా సేవా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాప అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ... హిందు ముస్లింలు అన్నదమ్ము లుగా పండుగ జరుపు కోవాలని కోరారు. అలాగే ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన దాడి రాజు కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ పట్టణ అధ్యక్షులు నందిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పట్టెల్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్ పటేల్, జవిద్ పాషా, ఎండి ఇసాక్, వెంకటేష్ లు పాల్గొన్నారు.