28-03-2025 06:12:29 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకొని శుక్రవారం భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు మైనారిటీలకు రంజాన్ తొఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మైనారిటీలు రంజాన్ పండగను ఘనంగా జరుపుకోవాలన్నారు. గత 30 సంవత్సరంల నుండి తమ స్వంత ఖర్చులతో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ ఏడాది రంజాన్ తోఫాలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్,సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ హైమద్,భాజపా జిల్లా నాయకులు కొట్నాక విజయ్, కాండ్రే విశాల్, సుంకరి పెంటయ్య, మాటూరి జయరాజ్, ముషీర్,నజీర్,అలీ, ఐలవెని సంతోష్ యాదవ్,శ్రీశైలం యాదవ్,వెంకన్న, నజీర్, తదితరులు పాల్గొన్నారు