26-03-2025 08:42:34 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని జామా మసీదులో ముస్లింలకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ నయీమ్ బాయ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు నిజాముద్దీన్ ల ఆధ్వర్యంలో రంజాన్ తోఫా లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ మాజీ జిల్లా అధ్యక్షులు బండి రాము, మైనార్టీ నాయకులు ఎండి ఖాజా పాష, ఇక్రాముద్ధిన్, ఎండి. జావిద్, ఆసిఫ్, ఇమ్ము, ఇలియాస్ లు పాల్గొన్నారు.