calender_icon.png 12 March, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

12-03-2025 12:54:25 AM

వజ్ర హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటూరీ నాగరాజు వితరణ 

కూసుమంచి , మార్చి 12 (విజయ క్రాంతి): పవిత్ర రంజాన్ పండుగ ఉపవాసాలు చేస్తున్న ముస్లిం మైనారిటీ సోదరులకు కూసుమంచి మండల కేంద్రంలోనీ వజ్ర హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటూరీ నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం  స్థానిక నాయకులతో కలిసి ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందించారు.. ఈ సందర్భంగా ఇంటూరీ నాగరాజు మాట్లాడుతూ.

నెల రోజుల పాటు ఎంతో నియమ నిష్ఠలతో కఠిన ఉపవాసం ఉంటూ , రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావించే ముస్లిం సోదరులకు పండుగ తొపాను అందించడం ఆనందంగా ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు మహ్మద్ హాఫీజుద్దీన్, హమీద్ పటేల్, అహ్మద్ ఖ్హురేశీ, అబ్దుల్ మజీద్ పటేల్, మాదాసు ఉపేందర్ రావు, బారి వీరభద్రం, నాగిరెడ్డి రంగా రెడ్డి, షేఖ్ మెహబూబ్ పాషా, కొండ మహిపాల్, చెన్న నవీన్ కుమార్, బెల్లంకొండ కిరణ్, అర్వపల్లి జనార్దన్ గౌడ్, మొహమ్మద్ రఫీ, మంద వెంకటేష్, గోపే మధు, సండ్ర రవీంద్ర ప్రసాద్, మాగి మహేష్, భోగి శ్రీకాంత్, కొండ విజయ్, ఆళ్లగడప సాగర్ వజ్ర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.