29-03-2025 10:15:50 PM
పటాన్ చెరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ముస్లింలకు శనివారం ఎండీఆర్ ఫౌండేషన్ రంజాన్ తోఫా, చీరలు పంపిణీ చేసింది. మాజీ జడ్పీటీసీ, పటాన్ చెరు లయన్స్ క్లబ్ ఫౌండర్ జైపాల్ ముదిరాజ్ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ తో కలిసి రంజాన్ తోఫా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రంజాన్ అనేది త్యాగం, భక్తి, సహనానికి ప్రతీక అన్నారు.
ఈ పవిత్ర మాసంలో ముస్లింలకు మా వంతు సహాయంగా గత ఎనిమిది సంవత్సరాలుగా రంజాన్ తోఫా చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎండీఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటుందన్నారు. ప్రజల మద్దతుతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.