calender_icon.png 11 January, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు రాజన్న కోడెలు పంపిణీ

04-07-2024 02:56:19 AM

  • పేద రైతులకు ఉచితంగా.. 
  • ప్రభుత్వ విప్ ఆది వెల్లడి

రాజన్న సిరిసిల్ల, జూలై 3 (విజయక్రాంతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందిస్తున్నట్టు ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం గోశాల నుంచి రైతులకు ఉచితంగా కోడెలు, ఆవుల పంపిణీని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి ప్రారంభించా రు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గోశాలలో 400 గోవుల సామర్థ్యం ఉన్నదని, ప్రస్తుతం అందులో 1,500కు పైగా కోడెలు, గోవులు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో వాటిని పేద రైతులకు, ఇతర గోశాలలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈవో వినోద్‌రెడ్డి పాల్గొన్నారు.మూలవాగులో చేపడుతున్న వంతెన నిర్మాణాలు వేగవంతం చేయాలని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ మండల పరిధిలో చేపట్టి వంతెనల నిర్మాణాలు, చెక్‌డ్యాంలను కలెక్టర్ సందీప్ కుమార్‌ఝాతో కలిసి పరిశీలించారు.  

రాజన్న సేవలో విప్ లక్ష్మణ్‌కుమార్

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సందర్శించారు. సామివారిని దరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ ఉపాధ్యక్షుడు బింగి మహేశ్ ఉన్నారు.