మహబూబ్ నగర్, జనవరి 31 (విజయ క్రాంతి) : హజ్రతే సయ్యదా జైనబ్ అలైహిసలాం జయంతిని పురస్కరించుకొని గులేమానే ఆహ్లెబైత్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల-3 పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులకు ప్రార్థనా శాలువాలు (దుప్పటాలు) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు సయ్యదా జైనబ్ త్యాగం. ధైర్యసాహసాల గురించి బాలికలకు వివరించారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సయ్యదా జైనబ్ స్ఫూర్తితో బాలికలు పట్టుదలతో చదివి ఉన్నతశిఖరాలను అదిరోహించాలని కోరారు.
కార్యక్రమంలో బాలికల-3 పాఠశాల ప్రిన్సిపాల్ సురేఖ, గులేమనే ఆహ్లెబైత్ అధ్యక్షులు మీర్ షోయబ్ అలీ, సభ్యులు జహంగీర్ పాష ఖాద్రీ, మహ్మద్ ఫారూఖ్ ఖాన్, సయ్యద్ అమీర్, మహ్మద్ అబ్దుల్ రహెమాన్, మహ్మద్ నజీర్, సయ్యద్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.