27-03-2025 06:56:37 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గురువారం ప్లేట్ల పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసిరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్లారెడ్డి మున్సిపల్ లోని 11వ వార్డు లింగారెడ్డి పేటకు చెందిన నర్ల రాజు, అఖిల దంపతులకు జన్మించిన పుత్రుడు మహన్షు మొదటి పుట్టినరోజు సందర్భంగా వారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి కావలసిన ప్లేట్లను కానుకగా అందించారని అన్నారు. వారి సంతోషాన్ని పాఠశాల విద్యార్థులతో పంచుకుంటూ మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు వారి ఔదార్యాన్ని అభినందించారు. ఆ గొప్ప దంపతులకు జన్మించిన మహన్షు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ,ఉమాదేవి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.