calender_icon.png 17 March, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ వాసులకు పట్టాల పంపిణీ

16-03-2025 04:54:27 PM

కృషి చేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ను అభినందించిన కాలనీ వాసులు...

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ పట్టాలు ఇచ్చేందుకు కృషి చేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియను శాలువాతో సన్మానించి కాలనీవాసులు అభినందించారు. కొన్నేళ్లుగా డబుల్ బెడ్రూంలో ఉంటున్న లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా ఆ విషయాన్ని గడ్డం ఇందుప్రియ దృష్టికి రాగానే ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఇంచార్జ్ మంత్రివర్యులు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహా దారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాలు ఇప్పించేందుకు, కృషి చేశారు. అధికారులతో చర్చలు జరిపి 300 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడంతో డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు ఆదివారం కామారెడ్డి మాజీ తాజా చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డిలను అభినందించి సన్మానం చేశారు. రాజీవ్ నగర్ కాలనీలో స్పెషల్ డ్రైవ్ నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, విద్యుత్ సమస్య, తీర్చడం పట్ల కాలనీవాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ అధ్యక్షులు డి రాజు, ఉపాధ్యక్షులు, శానవాస్ ఖాన్ మహిళ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.