calender_icon.png 19 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబాజీపేట్ తండాలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడుల పంపిణీ

18-03-2025 10:25:38 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబాజిపేట్ గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దీక్ష గురువుల చేతుల మీదుగా మంగళవారం ప్యాడ్, పెన్నులు పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముంబాజీపేట్ తండా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు బానోత్ పవన్ నాయక్ మాట్లాడుతూ... విద్యార్థులు ఒత్తడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి 10/10 గ్రేడ్ సాధించి తల్లిదండ్రుల పేరు ఉపాధ్యాయుల పేరు మన ఊరి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీక్ష గురువులు నరేష్ నాయక్ విద్యార్థులు పాల్గొన్నారు. 10/10 జిపిఏ. మార్కులు సాధించిన పేద విద్యార్థులకు పదివేల రూపాయలు బహుమతిగా ఇస్తామని తెలిపారు.