calender_icon.png 16 April, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

16-04-2025 01:54:59 AM

సూర్యాపేట, ఏప్రిల్15(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దాతలు పరీక్షా సామాగ్రి పంపిణీ చేయడం అభినం దనీయమని ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపా ధ్యాయుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వాంకుడోత్ వెంకన్న నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని జాల్ తండా, సోమ్లాతండా, బక్క హేమ్లా తండా, టీక్య తండా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు దాత కట్టంగూర్ తాసిల్దార్ ప్రసాద్ నాయక్ ఆర్థిక సాయంతో తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాల్లోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతా నికి గిరిజన ఉద్యోగులు, నాయకులు చేయూతనందియ్యాలని కోరారు.

రానున్న విద్యా సంవత్సరంలో తండాల్లోని పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, షూ, బెల్టులతో పాటు పాఠశాల అభివృద్ధిలో ప్రతి గిరిజన ప్రభుత్వ ఉద్యోగి భాగస్వామి కావాలని కోరారు. తన సొంత ఖర్చులతో జాల్ తండా పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించిన దాత తహసిల్దార్ దేశ్య నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గుగులోతు కృష్ణ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడ్ శంకర్ నాయక్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుణగంటి శ్రీనివాస్, సామ ఇంద్రారెడ్డి, మన్నెం శ్రీదేవి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడి టీచర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.