19-03-2025 11:17:31 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల జిల్లా పరిషత్ హై స్కూల్ లో బుధవారం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను ఎన్ ఎస్ యు ఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిలుముల సాయికుమార్ పంపిణీ చేశారు. విద్యార్థులంతా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాజుల రంజిత, ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామానికి చెందిన పలువురు యువకులు పాల్గొన్నారు.