calender_icon.png 8 April, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికులకు ఓఆర్‌ఎస్ పంపిణీ

03-04-2025 12:59:05 AM

కల్లూరు, ఏప్రిల్ 2 :-వేసవిలో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు కల్లూరు నూతన బస్టాండులో ప్రభుత్వ అధికారి నవ్య కాంత్ ఆధ్వర్యంలో ఓ.ఆర్.ఎస్ పాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ సరిరాం బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికులకు స్వాగతం కలిగించేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఓ.ఆర్. ఎస్ పాకెట్లు నిత్యం అందుబాటులో ఉంటాయని అన్నారు. అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది వడ దెబ్బకు గురి అయినట్లయితే బస్టాండులో నిత్యం అందుబాటులో ఉండే ఓఆర్‌ఎస్ పాకెట్ను ఉపయోగించుకుని ఉపశమనం పొందాలని ఆయన సూచించారు.

ప్రతిరోజు మూడు నెలలపాటు ప్రయాణికులకు ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ బస్టాండ్లో దాతలు సహకారంతో ఏర్పాటు చేసినట్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ప్రాంతీయ వైద్యాధికారి నవ్యకాంత మాట్లాడుతూ ఉండేందుకు కల్లూరు బస్టాండ్ నందు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకొని వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి , ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్, వి.బి. వోకిన్నెర ఆనందరావు, కంట్రోలర్స్ యంగల.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.