24-04-2025 07:07:59 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపల్ కార్యాలయంలో గురువారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం సిబ్బంది మున్సిపల్ సిబ్బందికి ఎండల తీవ్రత పెరిగిన కారణంగా అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారి పి కృష్ణ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, డాటా ప్రాసెసింగ్ అధికారి డి శ్యాంబాబు, సిస్టం మేనేజర్ ఏ శిరీష్, మెడికల్ హెల్త్ అసిస్టెంట్ బి మధుసూదన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.