calender_icon.png 19 April, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి సెలవుల్లో విద్యార్థులు హోమ్ వర్క్ చేసుకునేందుకు నోటు పుస్తకాల పంపిణీ

19-04-2025 08:00:09 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్(District Collector Jitesh V Patil) ఆధ్వర్యంలో, ITC సారపాక సహకారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో విద్యాభ్యాసన కొనసాగటం కోసం నోటు పుస్తకాలను శనివారం అందజేశారు. పాల్వంచలోని బొల్లోరు గూడెంలో గల టెక్స్ట్ బుక్స్ కేంద్రంలో  మండల విద్యాశాఖ అధికారి ఏ. శ్రీరామ్ మూర్తి  పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు.  పాల్వంచ, అర్బన్, మండలం లోని 62  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో - 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవటం కోసం 3,468 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు డబల్ రూల్, సింగల్ రూళ్ళ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ... ఇప్పుడు ఇచ్చే నోటు పుస్తకాలతో పాటు ఈనెల 23వ తేదీన విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా ఆయా పాఠశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఆ సమావేశంలో విద్యార్థులకు 3 వతరగతి వారికి 4 వ తరగతి కి సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాలు,  4 వ తరగతి  వారికి 5 వ తరగతి తెలుగు, ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాలు,  5వ తరగతి వారికి 6వ తరగతి తెలుగు, ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాలు , వీటితో పాటు ఏవైనా రెండు తెలుగు కథల పుస్తకాలు, రెండు ఇంగ్లీష్ కథల పుస్తకాలను అందజేయడం జరుగుతుందని అన్నారు.

ఈ పుస్తకాలను విద్యార్థులు ఇంటికి తీసుకు వెళ్లి వేసవి సెలవులలో రోజుకి 2 లేదా 3 పేజీలు  మనం ఇచ్చిన పాఠ్య పుస్తకాలు/కథల పుస్తకాలు చూసి నోటు పుస్తకాలలో విద్యార్థుల తల్లిదండ్రులు రాయించాలని, వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చేసరికి ఈ రెండు నోటు పుస్తకాలు పూర్తిగా నిండి ఉండేటట్లుగా పిల్లలకు, తల్లిదండ్రులకు చెప్పి పిల్లల చే రాయించి పాఠశాలలకు తీసుకుని రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమ విజయవంతమైన అయ్యేందుకు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు  విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల ఆర్పి రాజశేఖర్, భవాని శేఖర్, భూక్య శ్రీనివాస్, బాదావత్ శ్రీనివాస్, ఆదినారాయణ, లచ్చిరాం, సిఆర్పిలు ప్రభాకర్, శ్రీనివాస్, చందర్లాల్, గంగరాజు, కిషన్, తదితరులు పాల్గొన్నారు.