చేగుంట: మెదక్ జిల్లా మసాయి పేట్ మండలం వెనుక తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల వెనుక తండాలోని పిల్లలకు హెచ్.టి.యం.ఎస్. మేనేజర్ ప్రవీణ్ కుమార్, జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ చేతుల మీదుగా నోట్ బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, ఛార్ట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్.టి.యం.ఎస్. మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వెనుకబడిన ఈ గిరిజన గ్రామ పాఠశాలలోని విద్యార్థులకు నోట్ బుక్స్ అందచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ బాగా చదువుకోని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు, అనంతరం విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పువ్వుల బొకేలను, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. లక్షలు ఖర్చు చేసి చదివించే ప్రైవేట్ పాఠశాలలోని పిల్లల్లో కూడా ఇటువంటి సృజనాత్మకత ఉండదని ఈ గిరిజన విద్యార్థులను చూస్తుంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఏకలవ్యుని మాదిరిగా ఉన్నారని విద్యార్థులను అభినందించారు. పాఠశాల, ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల చదువుకునే మా పాఠశాలకు సహాయ సహకారాలు అందించిన జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కనకయ్య, ఉపాధ్యాయురాలు జ్యోతి, కృతజ్ఞతలు తెలుపడం జరిగినది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మా పాఠశాలలో చేయాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి.యం.ఆర్ హెచ్.టి.ఏం.ఎస్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, రక్షా ఎ.ఎస్.ఓ చరణ్ కుమార్, జి.యం.ఆర్ హైవే సూపర్వైజర్ నిలేష్ కుమార్, సి.యం.ఆర్ హాస్పిటల్ కో ఆర్డినేటర్ రాజ్ నారాయణ, వైద్యులు సాయి శ్రీ, ప్రవీణ్, వాలంటీర్ పోచాలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.