ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల పల్లి మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన ఉబ్బెన జోగరాజు గత నెలలో ఆనందపురం వద్ద బైక్ యాక్సిడెంట్ అయి తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో హాస్పిటల్ ఖర్చులు లక్షలు, పెట్టే పరిస్థితి లేక జాగరాజు అమ్మమ్మ అనసూర్య "పిండిపోలు రామయ్య సేవా సంస్థ" టేకులపల్లి మండలం బొమ్మనపల్లి విద్యుత్ శాఖ ఏఈ అధ్యక్షులు పిండిపోలు బుజ్జి కన్నయ్య, పనిచేస్తున్నారు. ఆయన వెంటనే వైద్యఖర్చుల నిమిత్తము వారి మిత్రుల వద్ద, బంధువులు, విద్యుత్ శాఖ సిబ్బంది వద్ద సేకరణ రూ.25 వేలు పిండిపోలు రామయ్య సేవాసంస్థ ద్వారా సేకరణ చేసిన డబ్బులను మోతుకురి ధర్మరావు ద్వారా ఉబ్బెర జోగరాజు బంధువులైన అమ్మమ్మ అనసూర్యకు అందజేశారు. జోగరాజుకి అమ్మా నాన్న లేరు. కొత్తగూడెంలో ఉన్న ప్రముఖులు, సేవా చెయ్యాలని, ఎవరైన ఆర్థిక సహయం చేయాలని అనుకుంటే ఈ నెంబర్ కు ఫోన్ పే చేయగలరని కోరారు. ఫోన్ పే నంబర్ 9392388292 చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విధ్యుల్ శాఖ ఏడిఈ రాంప్రసాద్, పద్య, కళ్యాణ్ పాల్గోన్నారు.