calender_icon.png 4 April, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజుల్లో 2500 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ

03-04-2025 12:00:00 AM

సన్న బియ్యం పంపిణీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

సూర్యాపేట ఏప్రిల్ 02: (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి బుధవారం పట్టణం లోని రేషన్ షాప్ నెంబర్ 14 ని పరిశీలిం చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు రోజుల్లో జిల్లాలోని 610 రేషన్ దుకాణాల్లో 1.24 లక్షల మంది లబ్ధిదారులకు 2500 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. లబ్ధిదారులతో బియ్యం నాణ్యత బాగుందా అని అడగగా గతంలో ఇచ్చిన దొడ్డబియ్యం తినే విధంగా లేవని ఇప్పుడు ఇస్తున్న సన్నబియ్యం నాణ్యతతో పాటు ప్రతి ఒక్కరు తినే విధంగా బాగున్నాయని కలెక్టర్ తో సంతోషంగా చెప్పారు.అనంతరం రేషన్ షాప్ లో ఉన్న స్టాకు,బియ్యం నాణ్యత,ఈ-పాస్ మిషన్‌లో జరుగుతున్న లావా దేవీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డటీ నాగలక్ష్మి,రేషన్ డీలర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.