యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): బిజెపి యాదాద్రి జిల్లా కార్యాలయంలో శనివారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మహమ్మద్ జావేద్ ఆలేరు పట్టణ రామ్ శివాజీ నగర్ నివాసి, మోత్కూర్ మండల్ రాగి బావి గ్రామస్తులు కేవినోద, దోతి గూడెం పోచంపల్లి మండల్ గ్రామస్తులు నాగరాజు, లింగారెడ్డిగూడెం చౌటుప్పల్ మల్లారెడ్డికి వైద్య సహాయం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్త, జిల్లా కార్యదర్శి వైజయంతి, జిల్లా అధికార ప్రతినిధి ఆకుతోట రామకృష్ణ మోత్కూర్ మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి రాధారపు మల్లేశం, పిన్నింటి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు