calender_icon.png 22 December, 2024 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేతంపూడి సొసైటీలో రైతులకు రుణాలు పంపిణీ

11-10-2024 04:02:34 PM

కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీలో శుక్రవారం రైతులకు రుణాలను పిఎసిఎస్ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావు పంపిణీ చేశారు. 1881 మంచి రైతులకు రూ.6.30 కోట్లు రుణమాఫీ కింద పంపిణీ చేయగా, 1415 మంది రైతులకు రూ.5.31 కోట్లు డెబిట్ వేవర్ లోన్ అందజేశారు. 250 మంది రైతులకు 1.22 కోట్లు పాత రుణాల మీద పెంచి ఇచ్చారు. ఈ రుణాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని సురేందర్ కోరారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పొన్నోజు ప్రేమాచారి, తగలుపు కార్యదర్శి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు ఉదయ్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.