calender_icon.png 12 March, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'ప్లంబర్స్' కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ

11-03-2025 09:05:40 PM

"ప్లంబర్స్ డే” వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని వైదేహి నగర్ లో మంగళవారం 'ప్లంబర్ డే' సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. ప్లంబర్లకు ఏవైనా సమస్యలు ఉంటే, తన దృష్టికి తేస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనిల్ చౌదరి, మాధవరం నర్సింహారావు, సతీష్ కుమార్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు మునగాల రాఘవేంద్రరావు, నాయకులు మనోజ్ గౌరీశెట్టి, కృష్ణ, శ్రీశైలం, రాజుగౌడ్, రషీద్, శివ ముదిరాజ్, శేఖర్, పారంద శ్రీకాంత్, కుంచాల రాంబాబు, ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు శివప్ప, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.